For A.P.Group IV Test Series and Guidance Contact @ 8101010185 in WhatsApp (no phone calls please) ..!

By Precision Academy
As we celebrate Mahatma Gandhi’s 150th birth anniversary explain how he would have responded to the state of the Indian media today
Posted on 2019-10-20 20:45:19
గాంధీజీ 150 వ జయంతి సందర్బంగా ఆయన ఇప్పటి ప్రసార మాధ్యమాల గురించి ఎలా స్పందిస్తారో ఊహించి వ్రాయండి.

https://www.thehindu.com/opinion/op-ed/what-would-gandhi-say-about-the-indian-media/article29568704.ece
Precision Academy
As we celebrate Mahatma Gandhi’s 150th birth anniversary explain how he would have responded to the state of the Indian media today
# 1
Replay on 21-10-2019 02:17:21
BY PHANINDRA:

(ప్రజల సమస్యల్ని మనోభావాల్ని ప్రభుత్వానికి, ప్రభుత్వ విధానాలను, పథకాలను ప్రజలకు చేరవేస్తూ..ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయటం వలన, అలాగే ప్రజాస్వామ్యం లోని మూడు ప్రధాన భాగాలైన శాసన,కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలపై ఒక నిఘా నేత్రం పనిచేయటం వలన..   పత్రికారంగం నాలుగో ఎస్టేట్ గా పిలవబడుతోంది.) 

మహాత్ముడు దక్షిణాఫ్రికాలో ఉన్నపుడే పత్రికారంగ ప్రాముఖ్యతను గుర్తించి, 'ఇండియన్ ఒపీనియన్'పత్రికనూ, తదనంతర స్వాతంత్ర్యోద్యమ కాలంలో ' యంగ్ ఇండియా, హరిజన్, నవ జీవన్' వంటి పత్రికల్ని స్వయంగా స్థాపించి, నడిపించారు. అంతేకాకుండా ప్రాంతీయ భాషల్లో పత్రికారంగ విస్తరణను అభిలాషించారు. మహాత్ముని 150 జయంతి సందర్భంగా.. నేటి మీడియా/పత్రికరంగాన్ని చూసి గాంధీజీ ఏవిధంగా స్పందించేవారో ఉహించే ప్రయత్నం చేద్దాం.

అనుకూల అంశాలు:
◆నేటి పత్రికా రంగ విస్తృతి ముఖ్యంగా ప్రాంతీయ భాషల్లో విరివిగా వెలువడుతున్న పత్రికలు.
◆బోఫోర్స్,రాఫెల్ వంటి కుంభకోనాలను వెలికితీసిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం.
◆ఎప్పటికప్పుడు సమాజంలోని విస్తృతమైన అంశాలపై నిరంతరం లైవ్ డేట్స్ అందిస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా.
◆స్టింగ్ ఆపరేషన్లు ద్వారా అవినీతిని వెలికితీయటంలో ముఖ్య భూమికను పోషిస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా..
◆అంతర్జాల విప్లవంతో సమాచార విప్లవం.
◆పౌర సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో మీడియా కృషి.
◆సమాచారాన్ని కేవలం పొందటమే కాకుండా పౌరులు సమాచారాన్ని సృష్టించడం, పంపిణీ ప్రసారం చేయగలగటం ద్వారా పౌరులకు సమాచార సాధికారత కలుగుజేస్తున్న సామాజిక మాధ్యమాలు(సోషల్ మీడియా).
◆అన్నా హజారే నేతృత్వంలోని జన లోక్ పాల్ ఉద్యమం వంటి అనేక సామాజిక ,పర్యావరణ 
ఉద్యమాలను అత్యంత వేగంగా, చౌకగా ప్రజలకు చేరువ చేయటంలో విజయవంతమైన సామాజిక మాధ్యమాలు.
◆చెన్నై వరదలు వంటి విపత్తుల సమయంలో ప్రజలందరూ సత్వరమే స్పందించగలగటం.
◆ఆన్ లైన్ వోటింగ్, ఫీడ్ బ్యాక్ వంటి వాటి ద్వారా పౌరులు తమ అభిప్రాయాలను తెలిజజేయటమే కాకుండా..విధాన నిర్ణయాల్లో భాగస్వాములు కావడం.

ప్రతికూల అంశాలు:
★ప్రత్రికారంగంలో క్షీణిస్తున్న విలువలు.. సంచలనాత్మక జర్నలిజం కు పెరిగిన ప్రాధాన్యత..
ఎలక్ట్రానిక్ మీడియా తమ టి.ఆర్.పి రేటింగులకై పెంచిపోషిస్తున్న నకిలీ వార్తా కథనాలు
★నీరా రాడియా టేపులు బయట పెట్టిన మీడియా రంగం, కార్పొరేట్ల మధ్య గల అనైతిక సంబంధాలు.
★పాత్రికేయులపై పెరుగుతున్న 'దేశద్రోహ కేసులు', గౌరి లంకేశ్ వాటి వారి హత్యలు.
★'రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్' ప్రచురించే 'ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్'లో 180 దేశాల జాబితాలో మనదేశం 140 స్థానంలో నిలవడం.
★పెయిడ్ న్యూస్
★దేశ ఐక్యతకు, సమగ్రతకు.. వ్యక్తుల ప్రతిష్టకు పెను సవాలుగా మారుతున్న సామాజిక మాధ్యమాల నకిలీ వార్తలు.
ఉదా: ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై జరుగుతున్న దాడులు, గోవధ పై ప్రచారాలు, జీనోసైడ్స్, సామూహిక దాడులు(మాబ్ లించింగ్స్)

*'అసత్యాలు, అర్థ సత్యాల వార్తల ప్రచురణ మానవత్వంపై చేసే నేరంగా'అభివర్ణించిన గాంధీజీ నేడు పత్రికరంగానికి సవాలుగా మారిన 'నకిలీ వార్తలను' చూసి బాధపడేవారేమో కానీ..ఏడూ దశాబ్దాలుగా  మన దేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా మనగలగటానికి, ప్రజలను రాజకీయంగా, సామాజికంగా సాధికారుల్ని చేయడంలో పత్రికారంగం/మీడియా కీలకపాత్ర పోషించినందున గాంధీజీ సంతోషించేవారని అనుకుంటున్నాను.