గ్రూప్–2 ఫలితాలు వచ్చాయి. ఉద్యోగం సాధించడానికి కావలసినన్ని మార్కులు సాధించిన అభ్యర్ధులందరికి మా హార్థికాభినందనలు. వీరిలో చాలా మంది మా precision academy online test series (ప్రెసిషన్ అకాడమీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్) ద్వారా మంచి మార్కులు సాధించగలిగామని ఫోన్ల ద్వారా తెలియజేస్తుండడం మాకు సంతోషకరమైన అంశం. 340.17,.... 329.81,..... 328.81,.... 327.10,.... 326.68,.... 326.62, ....., 323, 321.42,.., 317, 316.... 315.... 314.....వంటి మార్కులు పొంది. ఆయాకేటగిరీల్లో ఉన్నతోద్యోగాలు సాధించేవారు పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలిసింది.
౩౦౦ పైగా మార్కులొచ్చి కూడా 1 లేదా 2 మార్కులతో ఉద్యోగం పొందే అవకాశం కోల్పోయిన వారెందరో ఉన్నారు. వీరంతా చాలా నిరుత్సాహంతో ఉన్నారు. అలాగే సరైన సమయం పెట్టలేకనో, సరైన అప్రోచ్ లేకపోవడం వల్లనో 200 – ౩౦౦ మార్కులొచ్చినా వారు కూడా ఎందరో ఉన్నారు. వీరందరికీ మేము చెప్పేదొక్కటే- నీరసంగా, నిరుత్సాహంగా ఉంటే జీవితంలో ఏదీ సాధించలేరు. సరైన మార్గ నిర్ధేశనలో పట్టుదలతో కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదు.
తదుపరి నోటిఫికేషన్ లో వందల సంఖ్యలో ఉద్యోగాలసాధనే ధేయంగా మరింత మెరుగు పరుచుకుని, కొత్తగా గ్రూప్ – 2 ప్రిపరేషన్ ప్రారంభించేవారికి సైతం first attempt లోనే ఉన్నత ఉద్యోగాలు సాధించిపెట్టేలా మా వంతు తోడ్పాటు అందించాలనేది మా లక్ష్యం.
ప్రెషిషన్ అకాడమీ డైరెక్టర్ రవి శేఖర్ రెడ్డి గారు B.Tech మరియు MBA చేశాక స్టాటిస్టిక్స్ మరియు తెలుగు లిటరేచర్ లో మెయిన్స్ లో ఉత్తీర్ణులయ్యి 1991 లో Civil Services Interview దాకా వెళ్ళి పదిమార్కులతో సర్వీస్ మిస్ అయ్యారు. అయినా నిరుత్సాహ పడకుండా పరిశ్రమించి 1993 గ్రూప్ 1 లో ఉత్తీర్ణులయ్యారు. కొద్ది సంవత్సరాలు గ్రూప్ 1 ఆఫీసర్ గా ఉద్యోగం చేసి శాస్త్ర సాంకేతిక రంగాలను అర్థం చేసుకోవడం కోసం అమెరికా వెళ్ళి Learning Management System(LMS) లో సీనియర్ కన్సల్టెంట్ గా పనిచేశారు.
అమెరికాలోని General Motors Company లో చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నప్పటికీ, దానిని వదులుకొని భారతదేశం తిరిగి వచ్చి నిరుద్యోగులకు ఉపయోగపడేలా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని చదువుకు జోడించి తనవంతు కృషిని మొదలుపెట్టారు.
1) Where I want to be? (ఎక్కడకి పోవాలి?)
2) Where I am? (ఎక్కడ ఉన్నాను?)
పై రెండు విషయాలు తెలిస్తే దారి ఏర్పడుతుంది. దారి పొడవునా మైలు రాళ్ళు దాటుకుంటూ గమ్యాన్ని ఖచ్చితంగా చేరుకోవచ్చు.
పై విషయాలపై విశ్లేషణ చేయడం కోసం ప్రెషిషన్ అకాడమీ లో ఒక R & D టీమ్ ఉంది. వారు పది వేలదాక పాత ప్రశ్నాపత్రాల లోని ప్రశ్నలు topic మరియు sub topic ఆధారంగా విభజించారు. ఉదాహరణకు పాత పరీక్షా పత్రాలలో ఎకానమీలో ఎన్ని ప్రశ్నలు, పాలిటిలో ఎన్ని ప్రశ్నలు, S&T లో ఎన్ని ప్రశ్నలు ఇలా సబ్జెక్టుల వారీగా ఎన్నెన్ని ప్రశ్నలొస్తాయో చూస్తారు . ఆ తరువాత ప్రతి సబ్జెక్టు నుండి ఉదాహరణకు పాలిటిలోని ప్రాథమిక విధులలో ఎన్ని ప్రశ్నలు, ఆదేశిక సూత్రాలలో ఎన్ని ప్రశ్నలు ఇలా ప్రతి subject లో సబ్ టాపిక్ వైజ్ ఎన్ని ప్రశ్నలు వచ్చాయో విశ్లేషిస్తారు.
సబ్ టాపిక్ అనాలిసిస్ తరువాత డిఫికల్టీ లెవెల్ అనాలిసిస్ జరుగుతుంది. ప్రతి ప్రశ్న ఎంత కష్టంగా ఉందో విశ్లేషిస్తారు. తరువాత డైనమిక్/స్టాటిక్ అనాలిసిస్ చేస్తారు. అంటే ఆ ప్రశ్న పుస్తకాలనుంచి వచ్చిందా? లేక న్యూస్ పేపర్ల నుంచి వచ్చిందా? ముఖ్యంగా ఆర్థిక శాస్త్రం, శాస్త్ర సాంకేతిక శాస్త్రం, పర్యావరణము, భారతదేశ అంతర్జాతీయ సంబంధాల వంటి రంగాలలో లేటెస్ట్ డెవలప్ మెంట్ మీదనే ప్రశ్నలు వస్తుంటాయి.
పై విశ్లేషణలతో పాటు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో విశ్లేషిస్తాం అంటే అది ట్రివియల్ ప్రశ్నా?(సంఖ్యలు,పేర్లు అడగటం), ఫ్యాక్చువల్ ప్రశ్నా? (మెమోరీ ఆధారమైనదా?), కాన్సెప్చువల్ ప్రశ్నా? (కాన్సెప్ట్స్ ఆధారంగా నిర్మించబడ్డదా?) అని విశ్లేషించడం జరుగుతుంది.
చివరగా ప్రశ్నలు ఎలా అడిగారో విశ్లేషిస్తాం. అంటే ఆ ప్రశ్నలను డైరెక్ట్, మ్యాచింగ్ మరియు స్టేట్మెంట్స్(statements) ప్రశ్నలు గా విభజిస్తాం.
పై ఐదు కోణాలలో ప్రతి ప్రశ్నను విశ్లేషించాక అనలిటిక్స్ అన్న అత్యాధునిక టెక్నిక్ ద్యారా ఏ ఏ సబ్ టాపిక్ లో ఎలాంటి ప్రశ్నలు ఎన్ని రావచ్చో మా ఇన్ హౌస్ టెక్నాలజీ టీమ్ తయారు చేసిన అప్లికేషన్ ద్వారా ఊహించడం జరుగుతుంది. కొన్ని వేల పాత ప్రశ్నలు stratified random sampling ద్వారా విశ్లేషణ చేసి తద్వారా ప్రాబబిలిటీస్ ఎక్స్ పెక్ట్ చేయడం జరుగుతుంది.
పై విశ్లేషణ ద్వారా తెలిసిన విషయాలు ఆయా సబ్ టాపిక్స్ లో, అదే ప్రపోషన్ లో వివిధ డిఫికల్టీ లెవెల్స్ లో వివిధ రకాల ప్రశ్నలు దాదాపు 20 మందితో కూడిన కంటెంట్ టీం తయారుచేయడం జరుగుతుంది. ఈ ప్రశ్నలకు వివరణాత్మక సమాధానం కూడా తయారు చేయడం జరుగుతుంది.
అలాగే కరెంట్ అఫైర్స్ కోసం మాకు ఒక ప్రత్యేక విభాగం ఉంది. వీరు ప్రతి రోజు ఆ రోజు యొక్క డెవలప్ మెంట్స్ ఆధారంగా 5 ప్రశ్నలు చేసి అదే రోజు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తారు. అదనంగా ప్రతివారం 50 ప్రశ్నలు, ప్రతినెల 100 ప్రశ్నలు చేయడమేకాకుండా ప్రతి నెల వివిధ రంగాలలో ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ వార్తలను విశ్లేషించి క్లుప్తంగా ప్రతివిషయానికి సంబంధించి ఒక ఫోటో జత చేసి ఇస్తారు.
పై ప్రశ్నలు డెస్క్ టాప్ మరియు మొబైల్ లో కనిపించే విధంగా యూనికోడ్ లో తెలుగులో టైప్ చేశాక మా క్వాలిటీ టీమ్ ప్రతి ప్రశ్నను చెక్ చేసి, ఏమైనా తప్పులుంటే DTP టీమ్ ద్వారా సరిదిద్దడం జరుగుతుంది.
ఆ తరువాత విద్యార్ధి కోణంలో అలోచించి ఒక స్టడీ ప్లాన్ తయారు చేయడం జరుగుంతుంది. సిలబస్ లో ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి అన్న విషయం ఆధారంగా ప్రణాళిక తయారు చేసి విడుదల చేస్తాం.
ప్రణాళికాబద్ధంగా విద్యార్థులు చదువుకొని వారి అవగాహనను టెస్ట్ చేసుకోవడంలో భాగంగా ఆ పరీక్ష కోసం ప్రత్యేకంగా తయారు చేయబడ్డ టెస్ట్ సిరీస్ ను వినియోగించుకుంటారు. ప్రతి విద్యార్ధి మొట్ట మొదట తామెక్కడున్నామో తెలుసుకొనే విధంగా ఒక టెస్ట్ పెట్టి ఏ ఏ సబ్ టాపిక్స్ లో, ఎలాంటి ప్రశ్నలు ఎలా సమాధానం చేశారో తెలిపే విధంగా graphical description లో ఒక డిటెయిల్డ్ డయాగ్నిస్టిక్స్ ఇవ్వడం జరుగుతుంది. తరువాత ఒక్కో విషయంలో ఎంత గ్యాప్ ఉందో తెలుసుకొని వాటిపై శ్రద్ధ పెట్టి ఒక్కో చాప్టర్ ప్రాక్టీస్ టెస్టు ఒక మైల్ స్టోన్ లాగ ఉపయోగించుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే చాట్స్ ద్వారా భాస్కర్ సార్ ఆధ్వర్యంలో పని చేసే మా ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ తో చాట్ చేసి క్లారిఫై చేసుకొనే అవకాశం ఉంటుంది.
ఇలాంటి శాస్త్రీయ పద్దతిని అవలంబించడం ద్వారా ప్రెషిషన్ అకాడమీ అతి కొద్ది కాలంలోనే ఎన్నో విజయాలు సాధించడం జరిగింది. ఉదాహరణకు APPSC నిర్వహించిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో ప్రెషిషన్ అకాడమీ టెస్ట్ సిరీస్ నుండే అత్యధిక సంఖ్యలో ప్రశ్నలు రావడం జరిగింది. 150 లో దాదాపు 100 ప్రశ్నలు మా టెస్ట్ సిరీస్ నుండే వచ్చాయన్న విషయం వార్తా పత్రికలలో స్టేట్ ఎడిషన్ లో రావడంతో అది ఎంతో సంచలనం సృష్టించింది. కొన్ని ప్రశ్నలు డైరెక్ట్ గా మా టెస్ట్ సిరీస్ నుంచి వస్తే మరికొన్ని మా టెస్ట్ సిరీస్ లో మేము ఇచ్చిన వివరణల నుంచి వచ్చాయి.
ఈ విజయం తరువాత మేము మెయిన్స్ కోసం 9000 ప్రశ్నలు వివరణలతో సహా ఒక యజ్ఞంగా భావించి ఇవ్వడం జరిగింది. మా ఈ ప్రయత్నం కూడ పొల్లు పోలేదు, గ్రూప్ 2 మెయిన్స్ లో దాదాపు 200 ప్రశ్నలు Precision Academy Group-2 టెస్ట్ సీరిస్ నుండి వచ్చాయి. ఈ విషయం వివిధ వార్తా పత్రికల లో రావడం జరిగింది.
మా ఫలితాలు కూడ ఎంతో సంతృప్తి కరంగా వచ్చాయి ఎంతోమంది డిప్యూటీ తహసిల్దార్లు గాను, ACTO లు గాను మరియు ఎన్నో ఇతర పోస్టుల లోను స్థానం సాధించడం మాకెంతో ఆనందo కలిగించింది. వారిలో కొంత మంది ఏమంటున్నారో చూడండి
మా టెస్ట్ సిరీస్ తీసుకున్న వారిలో దాదాపు 200 నుంచీ ౩౦౦ మార్కులు వచ్చిన వారిలో దాదాపు 4౦౦ మందితో మేo మాట్లాడటం జరిగింది. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
1) మేం నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేశాం. నోటిఫికేషన్ కంటే సంవత్సరము ముందే ప్రిపరేషన్ మొదలు పెట్టిన వారు, నోటిఫికేషన్ తరువాత రివిజన్ మాత్రమే చేసుకుంటూ మాకంటే ముందుండి ఉద్యోగాలు సాధించుకున్నారు, మేము వెనకబడిపోయాo.
2) మెయిన్స్ కోసం ప్రెసిషన్ అకాడమీ రోజుకు మూడు పేపర్ల లెక్కన 60 టెస్టులు 150 ప్రశ్నలతో నిర్వహించింది. అన్ని ప్రశ్నలు రాసి వివరణలు చదవడానికి మాకు టైమ్ సరిపోలేదు. టైమ్ ప్రెషర్ తో మేం ఇవి పూర్తిగా చేయలేక పోవడంతో ఉద్యోగం చేజారి పోయింది.
మేము కోచింగ్ సెంటర్లను నమ్ముకున్నాం, చివరకు అక్కడ చెప్పినవి చాలా తక్కువ ప్రశ్నలొచ్చాయి.
ఈ విషయాలు వారి మాటల్లోనే.......
© 2016, Precisionacademy.in, All rights reserved
Precision Academy