For A.P.Group IV Test Series and Guidance Contact @ 8101010185 in WhatsApp (no phone calls please) ..!

By Precision Academy
The Cabinet recently cleared the Prohibition of Electronic Cigarettes Ordinance, 2019. What are the salient features of this act and why did the government ban e-Cigarettes?
Posted on 2019-09-20 01:41:07
https://www.thehindu.com/opinion/editorial/smoke-of-the-vaper-on-e-cigarettes-ban/article29461634.ece

ఎలక్ట్రానిక్ సిగరెట్లను నిషేదించే ఆర్డినెన్స్ ను  కేబినెట్ ఇటీవల ఆమోదించింది. ఈ చట్టం యొక్క ముఖ్య లక్షణాలను తెలియజేస్తూ ప్రభుత్వం ఇ-సిగరెట్లను ఎందుకు నిషేధించిందో వివరించండి
Precision Academy
The Cabinet recently cleared the Prohibition of Electronic Cigarettes Ordinance, 2019. What are the salient features of this act and why did the government ban e-Cigarettes?
# 1
Replay on 21-09-2019 07:19:51
ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ సారధ్యంలోని మంత్రివర్గ బృందం సిఫార్సుల మేరకు కేంద్రం ఎలక్ట్రానిక్ సిగరెట్లు, వ్యాప్స్, ఎలక్ట్రానిక్ హుక్కాలపై నిషేధం విధిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఆర్డినెన్స్ యొక్క ముఖ్య లక్షణాలను, నిషేధం విధించడానికి గల కారణాలను చర్చిద్దాం.

ఎలక్ట్రానిక్ సిగరెట్లు: ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్(ENDS) యొక్క సాధారణ రూపం ఇ-సిగరేట్స్. ఇవి ప్రాథమికంగా పొగాకును కాల్చకుండా, బ్యాటరీని ఉపయోగించి ద్రవరూపం లో ఉన్న నికోటిన్ ను ఆవిరిగా మార్చే పరికరం. వీటిని వినియోగించే వాళ్ళు, ఈ నికోటిన్ ఆవిరిని పీల్చుతారు.

ఎలక్ట్రానిక్ సిగరెట్లు నిషేధించిన ఆర్డినెన్స్ లోని ముఖ్యాంశాలు:
◆ ఇ-సిగరెట్లు, వ్యాప్స్, ఇ-హుక్కాల తయారీ, ఉత్పత్తి, ఎగుమతి, దిగుమతి, రవాణా, అమ్మకం, సరఫరా, నిల్వ చేయడం, ప్రకటనలు జారీ చేయడం(అంతర్జాలం తో సహా) చట్టరీత్యా శిక్షార్హమైన నేరం.
◆ పై చట్టాన్ని ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష లేదా జరీమానా లేదా రెండూ విధించబడతాయి.

ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధానికి గలా కారణాలు:

★వీటిలోని నికోటిన్ ఒక వ్యసనకారకమైన పదార్థం. ఒక పరిశోధన నివేదిక అనుసరించి, నికోటిన్ ట్యూమర్లు పెరగటానికి ఒక వృద్ధి కారకంగా పనిచేస్తుంది.అంటే కాకుండా అది నరాల బలహీనతను దోహదం చేస్తుంది. వీటి తయారీలో ద్రవ నికోటిన్ తో పాటు వినియోగించే ఇతర రసాయనాలు విషతుల్యాలుగా గుర్తించారు.
★వాస్తవానికి వీటిని, ధూమపాన వ్యాసనానికి బానిసలుగా మారిన వారిని, ఆ వ్యసనం నుండి విముక్తి చేయడానికి 'తక్కువ హాని కలిగించే ' ప్రత్యామ్నాయాలుగా ప్రచారం జరిగినప్పటికీ.. వాస్తవం అనేకమంది వీటికి అలవాటుపడుతున్నారు.
★వీటిని దీర్ఘకాలం వినియోగించే వారు శ్వాసకోశ  సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెకు సంబంధించిన వ్యాధులు బారిన పడుతున్నట్లు ఇటీవల పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
★ఇటీవల సామాజిక మాధ్యమాలలో ఇవి హానికరం కాని ఒక సరదాగా ప్రచారం జరుగుతుండటంతో చాలామంది యువతీ యువకులు వీటికి ఆకర్షితులవుతున్నారు. సరదాగా మొదలైన ఈ అలవాటు చివరకు సాధారణ పొగాకు ఉత్పత్తులకు బానిసలుగా మారుతున్నారు.

కేంద్రం మన యువత వీటి బారిన పడకుండా ఆరోగ్యవంతులుగా ఉండేందుకు అవకాశం కల్పించే ఒక ప్రగతిశీల చట్టాన్ని చేసింది. దీన్ని చిత్తశుద్ధితో అమలు చేసి మన ప్రధాని ఆకాంక్షించే 'ఆరోగ్య భారత్' కలను సాకారం చేసుకుందాం.