For A.P.Group IV Test Series and Guidance Contact @ 8101010185 in WhatsApp (no phone calls please) ..!

GRAMA/WARD SECRETARIAT (Telugu)

ప్రియమైన గ్రామ మరియు వార్డు సచివాలయ అభ్యర్థులారా,

 

కనీ వినీ ఎరుగని రీతిలో రెండు నెలల వ్యవధిలో పరీక్షలు నిర్వహించి లక్ష మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలివ్వడం ఒక వరల్డ్ రికార్డ్. సీరియస్ అభ్యర్థులందరికీ సంవత్సరము లో ప్రభుత్వ ఉద్యోగాలు రావడం ఖాయం. (క్రింద చెప్పిన విషయాలు ఉద్యోగాలు తెచ్చుకోవడానికి ఎంతగానో ఉపకరిస్తాయి. మనం ఎన్నో విషయాలు షేర్ చేస్తూ ఉంటాము. రోజు దీన్ని షేర్ చేయండి. ఇది ఎందరికో ఉద్యోగం వచ్చేలాగా చేసి వారి జీవితాన్నే మార్చే అవకాశం వుంది. మీరూ చదవండి, మార్గంలో ప్రయత్నిస్తే పరీక్ష లో ఖచ్చితంగా ఉత్తీర్ణులు కావచ్చు )

 

ఐతే ఇక్కడ మీరందరు గమనించ వలసిన ఒక ముఖ్య విషయం ఏమంటే, ప్రతి ఒక్కరికీ 40 శాతం మార్కులు రావాలి. అంటే మైనస్ మార్కులు పోగా కనీసం 150 కి 60 మార్కులు రావాలి. ఉన్న సమయం చాలా తక్కువ. ఎలా సాధించాలి? వేటిమీద దృష్టి పెట్టాలి? విషయాలు చర్చించే ముందు సిలబస్ ఒకసారి పరిశీలిద్దాం ...

 

పార్ట్-

 

1. మెంటల్ ఎబిలిటీ : మరియు రీసోనింగ్

2. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మరియు డేటా ఇంటెర్ప్రెటేషన్

3. కాంప్రహెన్షన్ - తెలుగు & ఇంగ్లీష్.

4. జనరల్ ఇంగ్లీష్.

5. ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం.

6. ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన వ్యవహారాలు.

7. జనరల్ సైన్స్ మరియు దాని అనువర్తనాలు రోజువారీ జీవితానికి, సమకాలీన

సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సహకారం

8. సుస్థిర అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ.

 

పార్ట్-బి

 

1. ఆంధ్ర ప్రదేశ్ మరియు భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి.

2. భారతీయ రాజకీయ వ్యవస్థ మరియు పాలన: రాజ్యాంగ సమస్యలు, 73/74 సవరణలు, ప్రజా

విధానం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు - ఆంధ్రప్రదేశ్కు నిర్దిష్ట సూచనతో రాష్ట్ర సంబంధాలు.

3. ఆంధ్రప్రదేశ్క#3137; ప్రాధాన్యతనిస్తూ భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ మరియు ప్రణాళిక.

4. సమాజం, సామాజిక న్యాయం, హక్కుల సమస్యలు.

5. భారత ఉపఖండం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క భౌతిక భౌగోళికం.

6. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం - పరిపాలనా, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రాజకీయ మరియు చట్టపరమైన చిక్కులు / సమస్యలు.

7. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమం మరియు అభివృద్ధి పథకాలు.

8. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళా సాధికారత మరియు ఆర్థిక అభివృద్ధి /

బలహీన వర్గాలపై దృష్టి సారించిన సంస్థలు.

 

పై వాటిలో ప్రాధాన్యతా క్రమం లో క్రింది విషయాలపై ద్రుష్టి పెట్టి మీరు 60 మార్కులు సులభంగా తెచ్చుకోవచ్చు

 

Part B

 

సంక్షేమ పథకాలు మరియు మహిళా సాధికారత: దీనికి సంబంధించి మీరు చదవ వలసిన డాక్యుమెంట్ 'ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్'. దీనిలో దాదాపు 30 ప్రభుత్వ పథకాల గురించి వుంది. దీనిలో అక్షరం పొల్లు పోకుండా మొత్తం చదివి ఒక పేపర్ మీద ముఖ్యమైన విషయాలు రాసి గుర్తు పెట్టుకోండి (దీనిని ప్రెసిషన్ వెబ్ సైట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు). వీటిపై ప్రెసిషన్ అకాడమీ లో అడిగే ప్రశ్నలన్నిటికీ సరిగా సమాధానాలు రాయండి.

 

మహిళా సాధికారత గురించి ప్రత్యేకమైన మంచి పుస్తకాలు దొరకవు. స్త్రీలకు సంబందించిన సంక్షేమ పథకాలు తెలుసుకొని, ప్రెసిషన్ టెస్ట్ సిరీస్ లోని ప్రశ్నకిచ్చిన వివరణలు చూస్తే సరిపోతుంది.

 

ఎన్ని మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం వుంది? - 20.

వెచ్చించ వలసిన సమయం - 1 రోజు లేదా 2 రోజులు

ఆశించదగ్గ ఫలితం - 15 మార్కులు

 

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం: దీనిలో 108 ఆర్టికల్స్ మరియు 13 షెడ్యూల్స్ ఉంటాయి. వీటిని ఒక్కసారి చదివి, అర్థం చేసుకొని పేపర్ మీద రాయాలి. చట్టం 5 సంవత్సరాల క్రితం చేసారు. తరువాత చట్టంలో ఎంత భాగం అమలులో వచ్చిందో మీరు గమనించండి. అలాగే దీనిపై ఏదైనా ఒక మంచి గైడ్ మధ్య విడుదల చేసినది చూసి చదవండి. సరిపోతుంది దీనికి సంబంధించి ప్రెసిషన్ అకాడమీ టెస్ట్ సిరీస్ లో అడిగే ప్రశ్నలన్నిటికీ సరిగా సమాధానాలు రాయండి.

 

ఎన్ని మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం వుంది? - 8

వెచ్చించ వలసిన సమయం - 1 రోజు లేదా 2 రోజులు

ఆశించదగ్గ ఫలితం - 5 మార్కులు

 

ఆర్థిక వ్యవస్థ: ఇందులో ముఖ్యంగా పంచవర్ష ప్రణాళికల గురించి చదువుకోవాలి. దీనికోసం పుస్తకాలు అనవసరం. అంత సమయం మన దగ్గర లేదు. ఆన్లైన్ లో చదువుకోండి. (ఉదాహరణకు లింక్ క్లిక్ చేయండి http://www.sakshieducation.com/POC/Story.aspx?nid=152066 )

 

అలాగే ఆంధ్ర ప్రదేశ్ ఎకనామిక్ సర్వే కూడా చదివితే కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది ( ఇంగ్లీష్ లో చదవగలిగే వారికోసం https://www.apfinance.gov.in/downloads/SocioEconomicalSurvey2018-19.pdf )

 

ఎన్ని మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం వుంది? - 8

వెచ్చించ వలసిన సమయం - 2 రోజులు

ఆశించదగ్గ ఫలితం - 4 మార్కులు

 

భారతీయ రాజకీయ వ్యవస్థ: దీనిలో ముఖ్యంగా 73/74 సవరణలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు చదువుకోవాలి. అలాగే పౌరసత్వం, ప్రాధమిక హక్కులు, ప్రాధమిక విధులు, ఆదేశిక సూత్రాలు కూడా చదివితే మంచిది. వీటికి సంబందించిన చాఫ్టర్లు మాత్రమే చదవాలి. మొత్తం రాజనీతి శాస్త్రం చదవ వలసిన పనిలేదు. దీనికోసం తెలుగు అకాడమీ వారి 'భారతీయ రాజ్యాంగం - పోటీ పరీక్షలకోసం' అన్న పుస్తకం కానీ లేదా లక్ష్మి కాంత్ రాజనీతి శాస్త్రం చదివితే సరిపోతుంది

 

ఎన్ని మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం వుంది? - 8

వెచ్చించ వలసిన సమయం - 2 రోజులు

ఆశించదగ్గ ఫలితం - 5 మార్కులు

 

ఇతర భాగాలు: భౌగోళిక శాస్త్రం మరియు చరిత్ర కొత్తగా చదవడానికి చాల సమయం పడుతుంది. ఇప్పటికే చదివి నోట్స్ రాసుకున్నవారు రివిసన్ చేసుకోవడం మంచిది. సమాజం, సామాజిక న్యాయం, హక్కుల సమస్యలు అన్న విషయం స్పష్టత లేని సిలబస్. దీనిని కొద్దీ రోజులలో చదవడం కంటే వదిలి వేయడమే మంచిది. ఐతే పూర్తిగా వదిలి వేయడం కాకుండా ప్రెసిషన్ అకాడమీ టెస్ట్ సిరీస్ చేస్తే కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ప్రెసిషన్ అకాడెమీలో చరిత్రకు సంబంధించి చాల వివరంగా ప్రతి ప్రశ్న తరువాత తెలియజేయడం జరిగింది. ఇది అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగ పడుతుంది

 

ఎన్ని మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం వుంది? - 30

వెచ్చించ వలసిన సమయం - 2 రోజులు

ఆశించదగ్గ ఫలితం - 11 మార్కులు

 

మొత్తం మీద పార్ట్ బి లో 75 మార్కులకు గాను 40 మార్కులు 8 నుంచి 10 రోజులు చదివి తెచ్చుకోవచ్చు.

 

Part A

 

గణితము, రీసోనింగ్ మరియు డేటా ఇంటెర్ప్రెటేషన్: మాథ్స్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లకు ఇది చాల స్కోరింగ్ టాపిక్. దీనికి మంచి పుస్తకం RS అగర్వాల్ . ఇది చాల పెద్దగా ఉంటుంది . మీరు ముఖ్యమైన ఫార్ములాలు మరియు వాటికీ సంబందించి మాదిరి లెక్కలు చూసుకుంటే సరిపోతుంది. అలాగే ప్ర#3142;సిషన్ టెస్ట్ సిరీస్ దాదాపు అన్ని మోడల్స్ కవర్ చేస్తుంది #3093;ాబట్టి ఏంటో ఉపయుక్తంగా ఉంటుంది. భాస్కర్ సార్ చే ఆన్లైన్ క్లాస్ వీడియోలు కూడా దీనికి ఉపయోగపడతాయి ( అరిథమెటిక్ పార్ట్ 1, డేటా ఇంటర్ప్రెటేషన్ పార్ట్ 1 &2). వీటిని ప్రెసిషన్ గ్రామా సచివాలయం కోర్స్ లో భాగంగా పొంద వచ్చు.

 

ఎన్ని మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం వుంది? - 20

వెచ్చించ వలసిన సమయం - 3 నుంచి 4 రోజులు

ఆశించదగ్గ ఫలితం - 15 మార్కులు (నాన్ మాత్ వాళ్ళు 5 నుంచి 8 మార్కులు తెచ్చుకోవచ్చు)

 

కరెంట్ అఫైర్స్, శాస్త్ర సాంకేతిక రంగం మరియు పర్యావరణం : దీనికి ఖచ్చితంగా 'ప్రెసిషన్ కరెంట్ అఫైర్స్' చదువుకోవాలి. ప్రెసిషన్ టెస్ట్ సిరీస్ లో రాజకీయ, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, పర్యావరణ, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ రంగాలపై పరీక్షకు పనికి వచ్చే ప్రతి అంశాన్ని క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. ప్రతి అంశం గుర్తుండిపోయేలాగా ఒక ఇమేజ్ కూడా పెట్టడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, SI , FRO తదితర పరీక్షలలో టెస్ట్ సిరీస్ లోని ప్రశ్నలే చాల వరకు వచ్చాయి. మెటీరియల్ చదివి, టెస్ట్ సిరీస్ చేస్తే చాలు.

 

శాస్త్ర సాంకేతిక రంగం మరియు పర్యావరణం కొద్ధి సమయంలో చదవడం వీలు కాదు. దీనికి కనీసం ఒక నెల పడుతుంది. దీనిలో స్టాటిక్ మరియు డైనమిక్ కంటెంట్ ఉంటుంది. డైనమిక్ కంటెంట్ అంటే రంగంలో మధ్య జరిగిన డెవలప్మెంట్స్. ఇవి ప్రెసిషన్ కరెంట్ అఫైర్స్ లో పూర్తిగా కవర్ అవుతాయి.

 

ప్రెసిషన్ మెటీరియల్ మరియు టెస్టులు 2019 జనవరి నుంచి జులై వరకు చదవండి . అలాగే ప్రతి రోజూ ప్రెసిషన్ హోమ్ పేజీలో 5 స్టార్ ఛాలెంజ్ అటెంప్ట్ చేయండి.

 

ఎన్ని మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం వుంది? - 25

వెచ్చించ వలసిన సమయం - 3 నుంచి 4 రోజులు

ఆశించదగ్గ ఫలితం - 15 మార్కులు

 

జనరల్ ఇంగ్లీష్ మరియు కాంప్రెహెన్షన్: దీనికి ప్రెసిషన్ ఇంగ్లీష్ మోడ్యూల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మోడ్యూల్ లో ఇంగ్లీష్ గ్రామర్ చాల శాస్త్రీయంగా వివరించడం జరిగింది. ఇంగ్లీష్ వొకాబులరీ రెయిన్బో aproach లో ఏంతో ఇంటరెస్టింగ్ గా వీడియోల ద్వారా చెప్పడం జరిగింది. అలాగే కాంప్రెహెన్షన్ కూడా ఇందులో ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొత్తగా గ్రామర్ కానీ వొకాబులరీ కానీ నేర్చుకోవడం అంటే కష్టం కానీ కాంప్రెహెన్షన్ లో కొద్దిగా ప్రిపేర్ ఐతే మార్కులు వచ్చే అవకాశం వుంది

 

తెలుగు కాంప్రెహెన్షన్ కు ప్రత్యేకమైన ప్రయత్నం అవసరం లేదు. దీనికి ప్రెసిషన్ అకాడమీ లో గ్రాండ్ టెస్టులలో ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది

 

ఎన్ని మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం వుంది? - 20

వెచ్చించ వలసిన సమయం - 3 నుంచి 4 రోజులు

ఆశించదగ్గ ఫలితం - 10 మార్కులు

 

మొత్తం మీద Part A లో 75 మార్కులకు గాను 40 మార్కులు 9 నుంచి 12 రోజులు చదివి తెచ్చుకోవచ్చు.

 

ఇంకొక అతి ముఖ్యమైన విషయం చెపుతాను. జాగ్రత్తగా పరిశీలించండి. అది నెగటివ్ మర్క్స్ గురించి. నెగటివ్ మర్క్స్ ఉన్నాయనగానే అందరూ భయపడి తెలియని విషయాలు అటెంప్ట్ చెయ్యరు. కానీ అది తప్పు. పూర్తిగా క్వశ్చన్ చదవకుండా అన్నిటికీ ఎదో ఒక ఆన్సర్ పెడితే 100 కి 25 మార్కులు వస్తాయి. ఇది థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ ప్రకారం నిరూపించబడిన విషయం (మీరు కుడా ప్రయత్నించి చూడండి. అంత వరకు దీనిని నమ్మడం కష్టం). మీకు 150 లో 50 ప్రశ్నలకు సమాధానాలు తెలుసు. మిగిలిన వాటిలో 30 ప్రశ్నలకు ఎలిమినేషన్ పద్దతిలో ఒక ఆప్షన్ తప్పు అని తెలుసుకున్నారనుకున్నాము. అప్పుడు 30 లో 10 కరెక్ట్ అవుతాయి. మిగిలిన 20 ప్రశ్నలకు నెగటివ్ మార్కుల కారణంగా ప్రతి తప్పుకు 0.25 మార్కులు మైనస్ అవుతాయి. అంటే 5 మైనస్ మార్కులు. నికరంగా 10 - 5 అనగా 5 మార్కులు వస్తాయి. ఇక మిగిలిన 70 ప్రశ్నలకు మీకు ఏమీ తెలియదు అనుకున్నాము. వాటిలో ప్రాబబిలిటీ ప్రకారం 23 కరెక్ట్ అవుతాయి. మిగిలిన 47 కు 15 నెగటివ్ మార్కులు వస్తాయి. అంటే నికరంగా 23 - 15 = 8 మార్కులు వస్తాయి. ఇలాగ సమాధానం తెలియని ప్రశ్నకు సంబంధించి 5 + 8 = 13 మార్కులు వస్తాయి. మీకు తెలిసిన 50 మార్కులకు 13 కలడంతో మీకు 63 మార్కులు వచ్చి మీరు మినిమం క్వాలిఫైయింగ్ మార్కులు 60 తెచ్చుకోవడం జరుగు తుంది. పేరాగ్రాఫ్ ఒకటికి రెండు సార్లు పూర్తిగా అర్థం అయ్యేలాగా చదవండి.

 

ప్రిపరేషన్ ప్లాన్ స్వయంగా 1993 బ్యాచ్ గ్రూప్ 1 ఆఫీసర్ మరియు ప్రెసిషన్ అకాడమీ డైరెక్టర్ యన్. రవి శేఖర్ రెడ్డి గారు ( http://precisionacademy.in/campaign/about-director ) తయారు చేసారు. దీని ప్రకారం ప్రిపేర్ ఐతే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు

 

మరిన్ని వివరాల కోసం ప్రెసిషన్ అకాడమీ వెబ్ సైట్ విసిట్ చేసి తెలుసుకో వచ్చు ( http://www.precisionacademy.in) లేదా 8101010140 / 50/60 నెంబర్లకు ఫోన్ చేసి గ్రామ సచివాలయం పరీక్షల గురించి సీనియర్ అకాడమిక్ consultants ను అడిగి తెలుసు కోవచ్చు.

 

దీనిని గ్రామ మరియు వార్డు సచివాలయం పరీక్షలను రాస్తున్న అభ్యర్థులకు షేర్ చేయండి. ఇది వారికి ప్రభుత్వ ఉద్యోగాన్ని తెచ్చుకొని అక్టోబర్ 2 నాటికి ఉద్యోగంలో చేరేలాగా సహాయపడుతుంది

 

జీవితంలో ఒకసారే ఇలాంటి అవకాశం తలుపు తడుతుంది... జారి పోనీకు మిత్రమా !

 

FREE MOCK TEST(Telugu)
Buy Packages
About Director
Success Stories